అల్లూరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-07-05T11:19:48+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తిని, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌

అల్లూరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

నివాళులర్పించిన కలెక్టర్‌, ఎస్పీ, డీఆర్వో


నెల్లూరు(హరనాథపురం), జులై 4: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తిని, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకొని  కొత్త జడ్పీలో శనివారం ఆయన చిత్రపటానికి కలెక్టర్‌  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తెలుగు నాట ఆంగ్లేయులను గడగడలాడించిన మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 


పోలీసుశాఖ ఆధ్వర్యంలో..

జిల్లా పోలీసు శాఖ ఆఽధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అల్లూరి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజలందరూ అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ భావన, ఏఎస్పీలు పీ వెంకటరత్నం, పీ మనోహర్‌రావు పాల్గొన్నారు. నగరంలోని దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో నగర డీఎస్పీ జే శ్రీనివాసులు రెడ్డి అల్లూరి చిత్రపటానికి మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ మిద్దె నాగేశ్వరమ్మ, ఎస్‌ఐ వేణుగోపాల్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T11:19:48+05:30 IST