Abn logo
Nov 30 2020 @ 03:37AM

అల్లూరి.. కొమురం.. కలిసేది అప్పుడే!

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘. ప్రస్తుతం పుణెలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ఇందులో భారీ పోరాట సన్నివేశాలున్నాయట. అటవీ ప్రాంతంలో 300 మంది ఆదివాసులు, 100 మంది పోలీసుల మధ్య ఎన్టీఆర్‌పై భారీ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారట రాజమౌళి. ఆ పోరాట సన్నివేశాలు దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని సమాచారం. ఆ సందర్భంలోనే తొలిసారి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుస్తారనీ, అక్కడి నుంచే ఇద్దరూ ఒక్కటై పోరాటం కొనసాగిస్తారని తెలిసింది. అయితే 25 నిమిషాల నిడివితో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు సినిమాలో ఎంత నిడివితో ఉంటాయనేది చూడాలి. తారక్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement