పోరాట యోధుడు అల్లూరి

ABN , First Publish Date - 2020-07-05T11:37:35+05:30 IST

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లాలో పలువురు ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి పోరాట యోధుడని, యువత ఆయనను స్ఫూర్తి

పోరాట యోధుడు అల్లూరి

న్యూస్‌ నెట్‌వర్క్‌ : అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లాలో పలువురు ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి పోరాట యోధుడని, యువత ఆయనను స్ఫూర్తి గా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. అల్లూరి జన్మస్థలం అయిన పాలకోడేరు మండలం మోగల్లులో ఎమ్మెల్యే రామరాజు పూలమాల వేశారు. కలెక్టరేట్‌ ఆవరణలో అల్లూరి విగ్రహానికి కలెక్టర్‌, జేసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరవాసరం మండలం కొణితివాడ, రాయకుదురు జడ్పీ హైస్కూల్‌లో నివాళులర్పించారు.


భీమవరంలో సీపీఎం, సీపీఐ, అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పాలకొ ల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో పాలకొల్లు ఎల్‌ఆర్‌పేట క్షత్రియ  కల్యాణ మండపం వద్ద, కెనాల్‌ రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. యలమంచిలి మం డలం నేరుడుమిల్లి, నార్నిమెరక, చించినాడ, కలగంపూడి, మట్లపాలెం గ్రా మాల్లో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆకివీడు మండలం సిద్ధాపురం, కోళ్ళపర్రులో అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేశారు.


కాళ్ళ మండలం బొండాడ జడ్పీ ఉన్నత పాఠశాల, ఏలూరుపాడు, పెదఅమిరం గ్రామాల్లో క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆచంట మండ లం కొడమంచిలి శివారు బండివారిపాలెం స్కూల్‌లో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెంలోని అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పూలమాల వేశారు. పోల వరం పంచాయతీ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ సుధాకర్‌ పూలమాల వేశారు. గోపాలపురం మండలం దొండపూడి, చింతల పూడి, కామవరపుకోట మండలాల్లో అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించా రు.


తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో నివాళులర్పించారు. దేవరప ల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ విశ్వనాఽథన్‌ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పరించారు. భీమడోలు, గణపవరం, నిడమర్రు మండలాల్లో పలువురు నివాళులర్పించారు. వెంకట్రామన్నగూడెం వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాల యంలో వైస్‌ చాన్సలర్‌ తోలేటి జానకిరామ్‌, రిజిస్ర్టార్‌ బి.గోపాల్‌, విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు, పరిశోధన సంచాలకులు రెడ్డి, డీన్స్‌ లక్ష్మీనారా యణరెడ్డి, ఎ.సుజాత అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. జంగారెడ్డిగూడెంలో అప్‌లాండ్‌ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి కార్యక్రమం నిర్వహించారు.


Updated Date - 2020-07-05T11:37:35+05:30 IST