ప్రతి ఒక్కరూ అల్లూరిని స్ఫూరిగా తీసుకోవాలి..

ABN , First Publish Date - 2022-07-02T06:07:18+05:30 IST

ప్రతీ ఒక్కరూ విప్లవ వీరుడు అల్లూరిని స్ఫూర్తి గా తీసుకోవాలని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కే నిశాంత వర్మ అన్నారు.

ప్రతి ఒక్కరూ అల్లూరిని స్ఫూరిగా తీసుకోవాలి..
ఎస్‌ఆర్‌కేఆర్‌ విద్యార్థుల ర్యాలీ

భీమవరం ఎడ్యుకేషన్‌, జూలై 1: ప్రతీ ఒక్కరూ విప్లవ వీరుడు అల్లూరిని స్ఫూర్తి గా తీసుకోవాలని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కే నిశాంత వర్మ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల్లో భాగంగా శుక్రవారం  కళాశాల నుంచి ఏఎస్‌ఆర్‌ నగర్‌లో అల్లూరి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్‌వి రంగరాజు, ప్రిన్సిపాల్‌ ఎం జగపతిరాజు, సత్యప్రతీక్‌వర్మ, కెబ్రహ్మరాజు, బిహెచ్‌విఎన్‌ లక్ష్మీ, పి.సత్యనారాయణరాజు, హరిమోహన్‌, తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ ఇ సీతారామరాజు అల్లూరి సీతారామరాజు వేషదారణ, భార్గవి భారత మాత వేషధారణ ఆకట్టుకున్నాయి.


స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి


భీమవరం టౌన్‌: అల్లూరి సీతారామరాజు విగ్ర హావిష్కరణ, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని అల్లూరి జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు అల్లూ రి సాయి దుర్గరాజు, సిఎస్‌ఎన్‌ కళాశాల వ్యవస్ధాపక అధ్యక్షు డు చీడే సత్యనారాయణ పిలు పునిచ్చారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 125 అడుగుల జాతీయ జెండాతో సిఎస్‌ఎన్‌ విద్యార్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. చెరుకువాడ రంగసాయి, సకుమళ్ళ సత్యనారాయణ, ఎండి సలీంఖాన్‌, రఘరాం, బొమ్మదేవర ప్రభాకర్‌, నరహరిశెట్టి కృష్ణ పాల్గొన్నారు. 


అల్లూరికి క్షత్రియ పరిషత్‌ నివాళి


పాలకొల్లు అర్బన్‌: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయం తి సందర్భంగా స్థానిక క్షత్రియ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానా యుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ పరిషత్‌ కార్యవర్గసభ్యులు పెదబాబు, విశ్వనాధరాజు, కేఎస్‌పిఎన్‌ వర్మ, వెంకట పతివర్మ, శివాజీ రాజు, భూపతిరాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు

స్థానిక ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ విద్యార్థులు కళాశాల నుంచి గాంధీ బొమ్మల సెంటర్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.  ప్రిన్సిపాల్‌ టి.రాజరాజేశ్వరి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్రోగ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, బి సుబ్బలక్ష్మి, వై.విజయ్‌కుమార్‌, మనోజ్‌, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. 


అల్లూరి జయంత్యుత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ


వీరవాసరం: మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవా రం కొణితివాడ అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ అల్లూరి పోరాటాలు స్ఫూర్తిదాయకమని, యువత అల్లూరి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈనెల 4న భీమవరంలో విగ్రహావిష్కరణ, ప్రధానమంత్రి నరేంద్రమోది సభకు యువత ర్యాలీగా కొణితివాడ నుంచి బయలుదేరాలని కోరారు. కార్యక్రమంలో నాగరాజు శ్రీనివాసరాజు, యరకరాజు సుబ్రహ్మణ్యంరాజు, యరకరాజు గోపాలకృష్ణరాజు, నాగరాజు గోపిరాజు, కుచ్చర్లపాటి కిషోర్‌వర్మ, రవివర్మ, వైవిఎల్‌ఎన్‌ రాజు(పెదబాబు) , తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:07:18+05:30 IST