Oct 28 2021 @ 19:42PM

అతిథిగా అల్లు అర్జున్.. హ్యాపీ మూడ్‌లో ‘పుష్పక విమానం’ టీమ్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ చిత్ర ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 30న హైదరాబాద్‌లో జరిగే వేడుకలో అల్లు అర్జున్ విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. 


బన్నీ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవుతుండటంతో ‘పుష్పక విమానం’ యూనిట్ అంతా హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లుగా ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ అన్నా.. అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా, నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన ఈ చిత్రానికి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు.