Oct 28 2021 @ 12:37PM

అల్లు అర్జున్ సూపర్ స్టార్: కరణ్ జోహార్

అల్లు అర్జున్ సూపర్ స్టార్ అంటూ బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ పొగడ్తలతో ముంచేశారు. యంగ్ హీరో నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరారు. ఇదే సమయంలో.. త్వరలోనే బాలీవుడ్ మూవీ 'సూర్యవంశి' కూడా ప్రేక్షకులముందుకు వస్తోంది. ఆ చిత్ర యూనిట్‌కి కూడా యావత్ దక్షిణాది తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను".. అని అన్నారు. మళ్ళీ ఇంతకముందులా ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం వస్తుందని చెప్పుకొచ్చారు.


దీంతో సూర్యవంశి చిత్ర నిర్మాత, ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జోహార్ స్పందించారు. "నిజంగా ఏరకంగా చూసినా అల్లు అర్జున్ సూపర్ స్టారే" అని ప్రశంసించారు. 'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అల్లు అర్జున్' అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే సూర్యవంశి చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి కూడా అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. 'నువ్వు రాక్ స్టార్ వి సోదరా' అని స్పందించారు. అలాగే 'పుష్ప' సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన సూర్యవంశి సినిమా నవంబరు 5న భారీ స్థాయిలో థియేటర్స్ ముందుకు రాబోతోంది.