Abn logo
Mar 1 2021 @ 15:09PM

'పుష్ప' టీజర్‌ డేట్‌.. ఫ్యాన్స్‌కు పండగే..!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఆగస్ట్‌ 13న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఇప్పటికే మారేడుమిల్లి, రంపచోడవరంలలో రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ  ప్రస్తుతం తెన్‌కాశీలో జరుగుతోంది. కాగా లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై దర్శక నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో అల్లు అర్జున్‌ పుట్టినరోజు(ఏప్రిల్‌ 8) ఉంది. ఆరోజున 'పుష్ప' టీజర్‌ను విడుదల చేస్తారట. ఈ సినిమాలో గుబురు గడ్డం, పొడవైన జులపాల లుక్‌తో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ లుక్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను కూడా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. 

ప్రపంచంలో శేషాచల అడవుల్లో మాత్రమే కనిపించే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు చైనా, జపాన్‌ వంటి పలు దేశాలకు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనంను స్మగ్లింగ్‌ చేశారు. దీనిపై డైరెక్టర్‌ సుకుమార్‌ రీసెర్చ్‌ చేసి వెబ్‌ సిరీస్‌గా చేద్దామని కథను సిద్ధం చేసుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ కథతోనే సినిమా చేస్తున్నానని సుకుమార్‌ రీసెంట్‌గా పాల్గొన్న ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో తెలియజేశాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లోవస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు మరింత బలాన్ని అందించేలా విడుదలవుతోన్న పుష్ప టీజర్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement