Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 15 Dec 2021 18:03:48 IST

కోలీవుడ్‌ ఎంట్రీతో నా కల నెరవేరింది: అల్లు అర్జున్‌

twitter-iconwatsapp-iconfb-icon

కోలీవుడ్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను స్వాగతిస్తున్నామని తమిళ చిత్ర అగ్ర నిర్మాతలు ఆర్‌.బి.చౌదరి, కలైపులి ఎస్‌.థానులు పేర్కొన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం తమిళ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక మంగళవారం చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌, లైకా ప్రొడక్షన్‌ హెడ్‌ తమిళ్‌కుమరన్‌, మాటల రచయిత మదన్‌ కార్గే, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, హీరో అల్లు అర్జున్‌, నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు చిరుత్తై శివలు పాల్గొన్నారు. ఇందులో ఆర్‌బి చౌదరి మాట్లాడుతూ, ‘హీరో అర్జున్‌కు ఒక్క తమిళంలో మినహా, మిగిలిన అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కానీ పుష్ప సినిమాలో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బన్నీకి ఇకపై కోలీవుడ్‌లో అభిమానగణం పెరుగుతుంది’ అన్నారు. మరో నిర్మాత కలైపులి ఎస్‌.థాను మాట్లాడుతూ.. ‘‘ఐకాన్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్‌ చిత్రం ‘పుష్ప’లో భాగస్వామ్యం కాలేకపోయాను. ఈ చిత్రంలోని పాటలు చాలా బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటమ్‌ సాంగ్‌ అదిరిపోయింది. అల్లు అర్జున్‌ని తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. ఈ మూవీ ద్వారా అది నెరవేరుతుంది. ఇలాంటి చిత్రాన్ని రాష్ట్రంలో రిలీజ్‌ చేసే అవకాశం దక్కలేదు. సంగీత దర్శకుడు డీఎస్పీ వయసుకు, ఆయన సంగీత స్వరాలు సమకూర్చే పాటలకు ఏమాత్రం పొంతన లేదు. ‘సామి.. నా సామి’ అనే పాట మెస్మరైజ్‌గా ఉంది. తమిళ పరిశ్రమకు వస్తున్న బన్నీకి అభినందనలు’’ అన్నారు.

సంగీత దర్శకుడు డీఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం బన్నీ పడిన కష్టం మాటల్లో చెప్పలేను. పుష్ప మూవీకి ఒక సంగీత దర్శకుడిగా ఈ మాట చెప్పడం లేదు. ఒక స్నేహితుడిగా, ప్రేక్షకుడిగా మనస్పూర్తిగా చెబుతున్నాను. ఖచ్చితంగా ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్‌ యాక్షన్‌కు జాతీయ అవార్డు వస్తుంది అని దేవీశ్రీ ప్రసాద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మాటల రచయిత మదన్‌ కార్గే మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్‌ వ్యక్తిగత వినతి మేరకు ఈ చిత్రానికి పని చేశాను. ఈ చిత్రంలోని ప్రతి ఒక్క సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్సెస్‌, లవ్‌ సీన్స్‌, నటన, ఒక విధమైన యాస ఇలా ప్రతి అంశం సూపర్బ్‌గా వచ్చింది’’ అని వివరించారు. 


హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది పెరిగింది చెన్నైలోనే. అందుకే తమిళం సరిగ్గా రాకపోయినా ఆ భాషలోనే మాట్లాడుతాను. ఆ భాషలోనే మాట్లాడితేనే కిక్‌ ఉంటుంది. నిజంగానే అన్ని భాషల్లో ఫ్యాన్స్‌ ఉన్నారు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం లేరు. అయితే, సరైన కంటెంట్‌ ఉన్న చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలని కొన్నేళ్ళుగా భావిస్తున్నాను. అది ‘పుష్ప’ ద్వారా నెరవేరింది. నా కోలీవుడ్‌ ఎంట్రీకి ‘పుష్ప’ సరైన చిత్రంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాం. ఇది కేవలం ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో పుష్పరాజ్‌ అనే యువకుడి కథ మాత్రమే. గతంలో జరిగిన అనేక సంఘటనలు ఈ చిత్రంలో లేవు’’ అని అల్లు అర్జున్‌ క్లారిటీ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషాల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రం విడుదలవుతోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement