Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 29 Jan 2022 21:55:40 IST

అతనికి సంగీతంతో పనిలేదు.. అతనే సంగీతం: అల్లు అర్జున్

twitter-iconwatsapp-iconfb-icon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప’ చిత్రాలలో సిధ్ శ్రీరామ్ పాడిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. అయితే ఇప్పటి వరకు సిధ్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని బన్నీ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన గాత్రానికి సంగీతంతో పనిలేదని, అది ఒక సంగీతమంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. అందులో.. 


‘‘కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు ఇది చెప్పాలనుకున్నాను. ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకలో నా సోదరుడు సిధ్ శ్రీరామ్ ‘శ్రీవల్లి’ పాటను పాడారు. ఎటువంటి సంగీత వాయిద్యాలు లేకుండా అతను పాటను స్టార్ట్ చేశారు. నేనింకా నిదానంగా అతని పాటకి వెనుక సంగీతం మొదలు పెడతారేమో అని వేచిచూస్తున్నా. కానీ, సంగీతం మొదలు కాలేదు. ఎటువంటి సంగీతం లేకుండా.. పాటను పాడుతూనే ఉన్నారు. ఆశ్చర్యపోయా. నాకది అద్భుతంగా అనిపించింది. అతనికి సంగీతంతో పనిలేదు.. అతనే సంగీతం’’ అని బన్నీ తెలిపారు. దీనిపై స్పందించిన సిధ్ శ్రీరామ్.. ఇది నిజమైన గౌరవంగా భావిస్తున్నానని బన్నీకి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా మరెన్నో మంచి పాటలు తన కోసం పాడేందుకు వేచిచూస్తున్నానని పేర్కొన్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement