Abn logo
Mar 29 2020 @ 14:44PM

వేడుక‌ను వాయిదా వేసుకున్న బ‌న్నీ

Kaakateeya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో భారీ స‌క్సెస్ ద‌క్కింది. ఈ స‌క్సెస్‌ను ప‌లు సంద‌ర్భాల్లో బ‌న్నీ సెల‌బ్రేట్ చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాదితో బ‌న్నీ సినిమా రంగంలోకి హీరోగా అడుగు పెట్టి 17 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ తండ్రి, నిర్మాత అల్లు అర‌వింద్ పెద్ద పార్టీని నిర్వ‌హించాల‌నుకున్నాడ‌ట‌. బ‌న్నీతో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు పిలుపు కూడా వెళ్లింద‌ట‌. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీ అంతా సైలెంట్ అయ్యింది. దీంతో బ‌న్నీ కూడా త‌న సెల‌బ్రేష‌న్స్‌ను మానుకున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

Advertisement
Advertisement
Advertisement