ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 ను లైకా వారు తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వారి సంస్థలో ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగే, లైకా ప్రొడక్షన్స్‌లో కోలీవుడ్ అగ్ర నిర్మాత శుభాస్కరన్ కూడా అల్లు అర్జున్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.