Abn logo
Apr 7 2020 @ 11:15AM

బన్నీ-సుకుమార్.. ఆశ్చర్యకర టైటిల్?

Kaakateeya

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో.. ఆయన పెట్టే టైటిల్స్ కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించడం ఆయన స్టైల్. `రంగస్థలం` వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. 


ఈ సినిమాకు కూడా సుకుమార్ ఓ ఆసక్తికర టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. శేషాచలం అడవుల బ్యాక్‌డ్రాప్‌లో స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు `పుష్ప` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప అట. హీరోయిన్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడట. `రంగస్థలం` తరహాలోనే ఈ సినిమా కూడా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతోందట. 

Advertisement
Advertisement
Advertisement