Jun 9 2021 @ 15:07PM

విక్రమ్ కుమార్‌తో అల్లు అర్జున్..?

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కథ సిద్దం చేసే పనిలో విక్రమ్ కుమార్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అక్కినేని నాగ చైతన్య - రాశిఖన్నా జంటగా 'థాంక్యూ' రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం. ఈ క్రమంలో నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు అల్లు అర్జున్‌తో జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో నటిస్తున్న బన్నీ, నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీనుతో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లైన్‌లోకి విక్రమ్ కుమార్ కూడా వచ్చి చేరారు. త్వరలో వీరి కాబినేషన్‌లో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశాలున్నాయట. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని విక్రమ్ కుమార్ 'థాంక్యూ' మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.