Oct 19 2021 @ 14:08PM

మల్దీవుల్లో విహరిస్తోన్న అల్లు అర్జున్ ఫ్యామిలీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈలోగా బ్రేక్ తీసుకున్న బన్నీ.. తన కుటుంబంతో ప్రస్తుతం మాల్దీవ్స్ లో విహరిస్తున్నారు. ఏమాత్రం వీలు చిక్కినా తన పిల్లలతో తనూ ఒక పిల్లవాడిగా కలిసిపోయి.. వారితో అల్లరి చేయడం బన్నీకి పరిపాటి. ఈ నేపథ్యంలో ఇప్పుడొచ్చిన ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఛలో మాల్దీవులు అంటూ.. అక్కడ ఖుషీ చేస్తుండడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోతో ఈ విషయం రివీలైంది. బన్నీ, స్నేహ నిలబడి ఇచ్చిన టైటానిక్ పోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అల్లు అర్జున్ పక్కన ఉంటే ఏదైనా చాలా బెటర్గా ఉంటుందంటూ.. ఆవిడ ఓ కేప్షన్ కూడా ఇచ్చారు. దానికి మంచు లక్ష్మి ఫరెవర్.. ఎవర్ అండ్ ఎవర్ .. అంటూ కామెంట్ చేశారు.