Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 05 Jul 2022 15:53:04 IST

టాంజానియా అడవుల్లో Allu Arjun ఫ్యామిలీ

twitter-iconwatsapp-iconfb-icon

అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ రెండో భాగంపై అభిమానులు విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైంది ‘పుష్ప’ చిత్రం. ఇప్పటికి దాదాపు ఏడునెలలైపోయింది. బన్నీ తన కెరీర్ లో ఎప్పుడూ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోలేదని చెప్పాలి. రెండో భాగం ఎంత త్వరగా మొదలు పెట్టాలి అనుకున్నప్పటికీ.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు ఇంకా రెడీ అవలేదు. ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరింతగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ మరోసారి ఒక చక్కటి ప్రదేశానికి లాంగ్ వెకేషన్‌కు వెళ్ళారు. దానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


టాంజానియా (Tanzania) అడవుల్లో బన్నీ కుటుంబం ప్రత్యక్షమవడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అక్కడ సెరంగెటి నేషనల్ పార్క్ చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో వెకేషన్ కు రావడం విశేషం. తనకి వీలు దొరికినప్పుడల్లా భార్యాపిల్లలకు మంచి సమయాన్ని కేటాయించడం బన్నీకి పరిపాటిగా మారింది. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ మొదలయితే.. తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించడం కుదరదని భావించాడో ఏమో గానీ.. ఇప్పడు వీలైనంత ఎక్కువ టైమ్ తన కుటుంబంతో బన్నీ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పాలి. ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కాబోతోంది. ఈ గ్యాప్ లో బన్నీ తన ఫ్యామిలీతో ఇంకెన్ని వెకేషన్స్‌ను చుడతాడో చూడాలి.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement