Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 12:59:30 IST

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ?

twitter-iconwatsapp-iconfb-icon
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ?

‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఆ సినిమాతో జాతీయ స్థాయిలో దక్కిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని బన్నీ ఇకపై అన్నీ పాన్ ఇండియా మూవీసే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఎలాగూ అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమా కూడా ఇదే రేంజ్  హిట్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పుడో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ 1ను తమిళంలో విడుదల చేసిన లైకా ప్రొడక్షన్స్ వారు అల్లు అర్జున్ తో ఓ భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ ఏఖంగా రూ. 75కోట్లు పారితోషికం డిమాండ్ చేశాడట. దీనికి లైకా ప్రొడక్షన్ వారు సముఖంగానే ఉన్నారట. ఇక ఈ సినిమాను సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్. 


‘రాజా రాణి’ తర్వాత అట్లీ..  దళపతి విజయ్ తో తీసిన ‘తెరి, మెర్సల్, బిగిల్’ చిత్రాలు మూడూ బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారుఖ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తాడని తెలుస్తోంది.  ఇప్పటికే అట్లీ అండ్ టీమ్ బన్నీ కోసం సూపర్ స్టోరీ రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నారట. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారట. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ .. ఈ కాంబినేషన్ లో మూవీ వస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement