రాక్ క్లైంబింగ్‌లో అదరగొట్టిన బన్నీ తనయ

అల్లు అర్జున్ కూతురు అర్హ నిజంగా చిచ్చరపిడుగే. అతి పిన్నవయసులో చెస్ ట్రైనర్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కిన ఘనత ఆ చిన్నారిది. సోషల్ మీడియాలో కూడా అర్హ యాక్టివిటీస్ కు ఏమీ తక్కువలేదు. తన చిలిపి పనులతో, అల్లరితో నిత్యం వార్తల్లో ఉంటూ అభిమానుల్ని ఆకట్టూ ఉంటుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో అర్హ ఒక చిన్నసైజులో ఉన్న రాక్ క్లైంబింగ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఎంతో ఉత్సాహంతో ఎలాంటి భయం లేకుండా.. తన తల్లి ప్రోత్సాహంతో బౌల్డరింగ్ చేసి అద్భుతం అనిపించింది. అంతేకాదు.. అర్హ అంత చిన్నవయసులోనే ‘శాకుంతలం’ చిత్రంలో భరతుడి పాత్ర పోషించి శభాష్ అనిపించుకుంది. అందులోని ఆమె క్యూట్ నటనకి దర్శకుడు గుణ శేఖర్ ఎంతో ముచ్చటపడిపోయారు. ఆమె పుట్టిన రోజునాడు ఆమెతో కేక్ కట్ చేయించి.. అర్హపై తన అభిమానాన్ని చాటుకున్నారు గుణశేఖర్. 


Advertisement