ఆ స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించండి

ABN , First Publish Date - 2020-06-04T09:08:05+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జీవో నంబర్‌ 296, 388ల ప్రకారం క్రమబద్ధీకరించిన పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలందించి,..

ఆ స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించండి

కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే వెలగపూడి


మహారాణిపేట, జూన్‌ 3:తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జీవో నంబర్‌ 296, 388ల ప్రకారం క్రమబద్ధీకరించిన పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలందించి, వాటిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను కోరారు. బుధవారం కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి నుంచి స్థిరనివాసం ఏర్పర్చుకున్న పేదల స్థలాలను క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం ఈ జీవోలు విడుదల చేసిందని గుర్తుచేశారు.


ప్రభుత్వం విధించిన నామమాత్రపు రుసుమును అప్పట్లో కొందరు చెల్లించగా, మరికొందరు ఎన్నికల కోడ్‌ రావడంతో చెల్లించలేకపోయారని చెప్పారు. అలాగే రుసుము చెల్లించిన వారి క్రమబద్ధీకరణ పట్టాలు కూడా రెవెన్యూ కార్యాలయాల్లో ఉండిపోయాయన్నారు. రుసుము చెల్లించని వారి నుంచి దాన్ని వసూలుచేసి అందరికీ క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వాలని, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సదుపాయం కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-04T09:08:05+05:30 IST