కనకమహాలక్ష్మికి స్వయం పూజలకు అనుమతించండి

ABN , First Publish Date - 2022-08-10T05:29:46+05:30 IST

కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆచార సంప్రదాయం ప్రకారం స్వయం పూజకు అనుమతించాలని భక్తులు కోరారు. మంగళవారం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవాలయం అబివృద్ధిపై భక్తులతో సమావేశం నిర్వహించి వారి అబిప్రాయాలను తెలుసుకున్నారు.

కనకమహాలక్ష్మికి స్వయం పూజలకు అనుమతించండి
అష్టదళ పద్మారాధనలో పాల్గొన్న భక్తులు

భక్తుల వినతి

మహారాణిపేట, ఆగస్టు 9: కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆచార సంప్రదాయం ప్రకారం స్వయం పూజకు అనుమతించాలని  భక్తులు కోరారు. మంగళవారం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవాలయం అబివృద్ధిపై భక్తులతో సమావేశం నిర్వహించి వారి అబిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం 24 గంటలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఆలయ అబివృద్ధిలో భాగంగా రీడింగ్‌ రూమ్‌ నుంచి ప్రైవేటు ఇళ్లు కొనుగోలు  చేయాలని సూచించారు. అనంతరం ఈవో కె.శిరీషా మాట్లాడుతూ భక్తుల సూచనలు అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని వివరించారు.

అష్టదళ పద్మారాధన

శ్రావణ మాసం మంగళవారం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారిని బంగారు పుష్పాలతో అష్టదళ పద్మారాధన నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.  





Updated Date - 2022-08-10T05:29:46+05:30 IST