నగదు బాండ్ల సమర్పణకు అవకాశమివ్వండి

ABN , First Publish Date - 2021-02-25T06:54:01+05:30 IST

జామీన్లకు బదులుగా నగదు బాండ్లు సమర్పిం చేందుకు అవకాశం ఇవ్వాలని బాంబే హైకోర్టును విప్లవకవి వరవరరావు బుధవారం

నగదు బాండ్ల సమర్పణకు అవకాశమివ్వండి

బాంబే హైకోర్టుకు వరవరరావు అభ్యర్థన


ముంబై, ఫిబ్రవరి 24: జామీన్లకు బదులుగా నగదు బాండ్లు సమర్పిం చేందుకు అవకాశం ఇవ్వాలని బాంబే హైకోర్టును విప్లవకవి వరవరరావు బుధవారం అభ్యర్థించారు. ఎల్గార్‌ పరిషద్‌ కేసులో ఎన్‌ఐఏ విచారణను ఎదుర్కొంటున్న వరవరరావుకు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్‌ మం జూరు చేసిన విషయం తెలిసిందే.


అయితే రూ.50 వేల వ్యక్తిగత నగదు బాండ్లు, అంతే మొత్తం బాండ్లు ఉన్న ఇద్దరు జామీనుదార్లు(ష్యూరిటీ) ఉండాలని కోర్టు నిబంధన విధించింది. కొవిడ్‌ వల్ల జామీనుదార్లను సంపాదించేందుకు సమయం పడుతుందని వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌.. ఎస్‌ఎస్‌ షిండే, మనీశ్‌ పితాలే నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్‌ విధివిధానాలు పూర్తయి, ఆరోగ్యం మెరుగైన వెంటనే వరవరరావును విడుదల చేయనున్నారు.


Updated Date - 2021-02-25T06:54:01+05:30 IST