న్యూడిల్లీ: ఈ ఏడాది నవంబర్లో జరగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఏన్డీఏ) ఎంట్రన్స్ ఎగ్జామ్కు ఔత్సాహిక మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి సూచించింది. వచ్చే ఏడాది నుంచి వారిని అనుమతిస్తామని చెప్పడం సరికాదంది. ‘‘ త్రివిధ దళాలు అనేవి అత్యవసర సమయంలో పోరాడేందుకు ఉపయోగపడతాయి. ఏన్డీఏలో మహిళలకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది. మహిళలకు అవకాశం కల్పించాలంటే కేంద్రప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. సర్కారుకు కలిగే ఇబ్బందుల గురించి అర్థం చేసుకోగలం. కానీ, మరుసటి ఏడాదికి వాయిదా వేస్తామనడం సరికాదు ’’ అని వివరించింది. వచ్చే ఏడాది మే నుంచి మహిళలకు అవకాశం కల్పిస్తామని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం సుప్రీంకోర్టుకు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు చేసింది.