2 పరుగులకే ఆలౌట్‌!

ABN , First Publish Date - 2021-06-23T09:27:15+05:30 IST

ఏ మ్యాచ్‌లోనైనా జట్టు మొత్తం డకౌట్‌ అంటే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. అయితే, హంటింగ్‌డన్‌షైర్‌ కౌంటీ లీగ్‌లో ఫాల్కన్స్‌, బక్‌డెన్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకొంది.

2 పరుగులకే ఆలౌట్‌!

కౌంటీ లీగ్‌లో విచిత్రం

లండన్‌: ఏ మ్యాచ్‌లోనైనా జట్టు మొత్తం డకౌట్‌ అంటే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. అయితే, హంటింగ్‌డన్‌షైర్‌ కౌంటీ లీగ్‌లో ఫాల్కన్స్‌, బక్‌డెన్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకొంది. తొలుత ఫాల్కన్స్‌ 40 ఓవర్లలో 260/6 పరుగులు చేసింది. ఛేదనలో బక్‌డెన్‌ 8.3 ఓవర్లలో 2 పరుగులకే కుప్పకూలింది. బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయలేక పోవడం విడ్డూరం. ఆ రెండు పరుగులు కూడా వైడ్‌, బై ద్వారా వచ్చినవే. దీంతో ఫాల్కన్స్‌ 258 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.

Updated Date - 2021-06-23T09:27:15+05:30 IST