సింధు అకాడమీకి భూమి కేటాయింపు
ABN , First Publish Date - 2021-06-18T09:21:13+05:30 IST
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది.
అమరావతి (ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది. విశాఖపట్నం జిలా,్ల విశాఖ రూరల్ మండలం చిన్నగదిలి గ్రామంలో రెండు ఎకరాలను అకాడమీకి కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని వినియోగించాలని, కమర్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.