హరితహారం లక్ష్యాల కేటాయింపు

ABN , First Publish Date - 2020-10-01T10:51:20+05:30 IST

తెలంగాణ హరితహారం 2021-22 సంవత్సరాల్లో మొక్కలు నాటే లక్ష్యాలను జిల్లాలోని గ్రామ పంచాయతీలు,

హరితహారం లక్ష్యాల కేటాయింపు

కలెక్టర్‌ శశాంక


కరీంనగర్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ హరితహారం 2021-22 సంవత్సరాల్లో మొక్కలు నాటే లక్ష్యాలను జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేటాయించామని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హరితహారంపై జిల్లా స్థాయి మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ శాఖల వారీగా గత సంవత్సరం కేటాయించిన లక్ష్యంతో నాటిన మొ క్కల ఆధారంగా 2021-22 సంవత్సరంలో మొక్కలు నాటుటకు లక్ష్యంగా కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని ఇళ్ల సంఖ్యను బట్టి ఇంటి ఆవరణల్లో 6 లక్షల మొక్కలు నాటాలని, పంచాయతీరాజ్‌ రోడ్ల వెంబడి, ఆర్‌అండ్‌బి రోడ్లలో మొక్కలు నాటాలని ఆదేశించారు.


శాఖల వారీగా కావాల్సిన మొ క్కల వివరాలను లొకేషన్‌ వారిగా జిల్లా అటవీ అధికారికి రెండు వారా ల్లో పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సంవత్సరం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆబ్కా రిశాఖ వారికి కావలసిన ఈత మొ క్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కల విత్తనాలు సేకరించి నర్సరీల్లో పెంపకం చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్‌(ట్రైనీ) అంకిత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, జిల్లా పంచాయతీ అధికారి బుచ్చయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:51:20+05:30 IST