హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో 82.24 శాతం ఇంజనీరింగ్ సీట్లను కేటాయించారు. తెలంగాణలో 60,941 బీటెక్ సీట్లను భర్తీ చేసారు. కన్వీనర్ కోటాలో ఇంకా 13,130 సీట్లు మిగిలి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,108 సీట్లు ఉన్నాయి. 31 ఇంజనీరింగ్ కాలేజీల్లో తొలి విడతలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి.