అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలి

ABN , First Publish Date - 2022-05-24T06:52:12+05:30 IST

అర్హులకు డబుల్‌బడ్‌రూం ఇళ్లు కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు డిమాండ్‌ చేశారు.

అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలి
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు ె

 అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు 

 ఉద్రిక్తతకు దారితీసిన బీజేపీ ఆందోళన 

కార్యకర్తల అరెస్ట్‌, పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

భువనగిరి టౌన్‌, మే 23: అర్హులకు డబుల్‌బడ్‌రూం ఇళ్లు కేటాయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు డిమాండ్‌ చేశారు. భువనగిరిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అర్హులకు కేటాయించాలంటూ సోమవారం బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. అరెస్టయిన బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పోలీస్‌స్టేషన్‌లో పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అర్హులకు కేటాయించమని అడిగితే, ప్రభుత్వం అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లకు తర లించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఏడేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించడంలేదో పాలకులు, అధికారులు సమాధానం చెప్పాలన్నారు. వెంటనే కేటాయించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఉమాశంకర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, ఉడుత భాస్కర్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ సుర్వి లావణ్య, కౌన్సిలర్లు మాయ దశరథ, రత్నపురం బలరాం, ఉదయగిరి విజయ్‌కుమార్‌, బొర్ర రాఖేష్‌, నల్లమాస సుమ, జనగాం కవిత, ఉదరి లక్ష్మీ, నాయకులు పి.జగన్మోహన్‌రెడ్డి, పుల్ల శివ, కోళ్ల భిక్షపతి, కొండం ఉపేందర్‌గౌడ్‌, వైజయంతి, రాజమణి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T06:52:12+05:30 IST