భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని భద్రాచలంలో గల ఇసుక ర్యాంప్ విషయంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తనను వేధిస్తున్నాడంటూ జిల్లా కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్ సంచలన ఆరోపణలు చేసారు. జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా కోపరేటివ్ అధికారి వెంకటేశ్వర్‌కు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మధ్య భద్రాచలంలో ఇసుక ర్యాంపు విషయంలో పరస్పర ఆరోపణల పర్వం కొనసాగింది. జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని ఎమ్మెల్సీ బాలసాని ఆరోపించారు. భద్రాచలంలో ఇసుక ర్యాంప్ విషయంలో తనను ఎమ్మెల్సీ బాలసాని వేధిస్తున్నాడంటూ వెంకటేశ్వర్ ఆరోపించారు. వివాదం పెరుగుతండడంతో ఇరువురిని కలెక్టర్ అనుదీప్ సముదాయించారు.