నారసింహుని సన్నిధిలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-10-20T07:05:03+05:30 IST

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల యంలో శ్రీవారు, అమ్మవార్లకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వివేక్‌ కుమార్‌సింగ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నారసింహుని సన్నిధిలో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి

కదిరిఫీచర్స్‌ , అక్టోబరు 19 : పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల యంలో శ్రీవారు, అమ్మవార్లకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వివేక్‌ కుమార్‌సింగ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన న్యాయమూర్తికి తూర్పు రాజగోపురం వద్ద మంగళ వాయిధ్యాలు, మంత్రోత్సా రణలతో ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ఆవరణ లోనే ఆనవాయితీ ప్రకారం న్యాయమూర్తికి పురోహి తులు ఘనసన్మానం నిర్వహించి, శ్రీవారి చిత్రపటాలు, ప్రసాదాలు బహూకరించారు. ఆలయ చారిత్రక నేపథ్యాన్ని, ప్రాశస్థ్యాలను న్యా యమూ ర్తికి పురోహితులు వివరిం చి చెప్పారు. న్యాయమూర్తి వెంట కదిరి కోర్టు సి బ్బంది, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లింగాలలోకేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-20T07:05:03+05:30 IST