బురద చల్లడం చంద్రబాబుకు కొత్త కాదు: మంత్రి ఆళ్ల నాని

ABN , First Publish Date - 2021-05-15T21:48:20+05:30 IST

బురద చల్లడం చంద్రబాబుకు కొత్త కాదు: మంత్రి ఆళ్ల నాని

బురద చల్లడం చంద్రబాబుకు కొత్త కాదు: మంత్రి ఆళ్ల నాని

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రాబుకు బురద చల్లడం కొత్త కాదని మంత్రి ఆళ్ల నాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు పెడుతూ తరుచూ విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యాలపై శనివారం మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ‘‘అచ్చెన్నాయుడు విమర్శలకు సమాధానం చెప్పే సమయం మాకు లేదు. నిత్యం విమర్శలు చేసే టిడిపి నాయకులు  ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రండి. అలా వీలు కాక పోతే దూరంగా వుండండి. కానీ అడ్డు పడకండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు పై దృష్టి పెట్టాము. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని సూచించాము యాజమాన్యాలు అంగీకరించాయి’’ అని మంత్రి ఆళ్ల నాని అన్నారు.

Updated Date - 2021-05-15T21:48:20+05:30 IST