ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం.. 15 నిమిషాల్లో పని పూర్తి చేసిన మంత్రి

ABN , First Publish Date - 2021-06-20T22:35:15+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం.. 15 నిమిషాల్లో పని పూర్తి చేసిన మంత్రి

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం.. 15 నిమిషాల్లో పని పూర్తి చేసిన మంత్రి

అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన నోషిత అనే విద్యార్థిని తల్లి పోణక అనుపమ మే 5న నెల్లూరు షైన్ ప్రవేట్ హాస్పిటల్‌లో  కోవిడ్ వల్ల మృతి చెందారు. జూన్ 11న తన తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం నోషిత ఆలూరు నగర పాలక పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేశారు. నెలరోజులుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో మావయ్య అని సంబోదిస్తూ నోషిత నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ‘జగన్ మామయ్య... అమ్మ డెత్ సర్టిఫికెట్ ఇప్పించరూ’ కథనం ప్రసారం చేసింది. ఈ కథనంపై  ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు.  నెల్లూరు జిల్లా జడ్పీ‌సీఈవో పి.సుశీల, డీఎమ్‌హెచ్‌వో డాక్టర్ రాజ్యలక్ష్మి ఫోన్ చేశారు. వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేలా సంబంధించిన అధికారులకు అదేశాలు ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. దీంతో ఆలూరు నగరపాలక పంచాయతీ ఇంచార్జి కమీషనర్, సెక్రటరీ‌తో మాట్లాడి నోషితకు తన తల్లి పోణక అనుపమ డెత్ సర్టిఫికెట్‌ను15 నిముషాల్లో అందజేశారు. 


Updated Date - 2021-06-20T22:35:15+05:30 IST