కీరాలో కోరుకున్నన్ని..

ABN , First Publish Date - 2021-07-08T06:11:31+05:30 IST

కీర దోస అనగానే ఫేస్‌మాస్క్‌ వేసుకున్నప్పుడు కళ్ల మీద ఉంచుకునే కీరా స్లైసెస్‌ కళ్ల ముందు మెదులుతాయి.

కీరాలో కోరుకున్నన్ని..

కీర దోస అనగానే ఫేస్‌మాస్క్‌ వేసుకున్నప్పుడు కళ్ల మీద ఉంచుకునే కీరా స్లైసెస్‌ కళ్ల ముందు మెదులుతాయి. లేదా రెస్టారెంట్‌లో భోజనంతో పాటు సర్వ్‌ చేసే సలాడ్‌ బౌల్‌లో నుంచి తొంగి చూసే కీరా ముక్కలు గుర్తుకొస్తాయి. ఈ రెండు సందర్భాల్లోనూ అవి తినడానికి పనికొచ్చే పదార్థాలనే విషయమే మనకు గుర్తుకు రాదు. నిజానికి కీరాతో పొందే వీలున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే, వాటిని వెతుక్కుని మరీ లాగిస్తాం! 


సూర్యరశ్మిలోని అలా్ట్రవయొలెట్‌ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి

బరువు తగ్గుతాం

చర్మపు మెరుపు రెట్టింపు అవుతుంది

ఉబ్బిన ముఖం మామూలవుతుంది

వెంట్రుకలు బలం పొందుతాయి

ఒత్తిడి తగ్గుతుంది

తగిన నీరు శరీరానికి అందుతుంది

శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తాయి

మూత్రపిండాల్లోని రాళ్లు కరుగుతాయి

నోటి దుర్వాసన వదులుతుంది

జీర్ణశక్తి మెరుగవుతుంది

వాపులు తగ్గుతాయి

కళ్ల కింది నల్లని వలయాలు తగ్గుతాయి

మధుమేహం అదుపులో ఉంటుంది

చర్మపు బిగువు పెరుగుతుంది

Updated Date - 2021-07-08T06:11:31+05:30 IST