ఎంచక్కా... ఇంట్లోనే!

ABN , First Publish Date - 2020-03-21T05:54:55+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో అనేక రాష్ట్రాలలో పాఠశాలలకు అనుకోకుండా సెలవులు వచ్చిపడ్డాయి. దీనివల్ల చాలామంది పిల్లలు ఏడాది చివర పెట్టే పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నారు. టీచర్ల దగ్గర సందేహాలు నివృత్తి చేసుకోవడానికి

ఎంచక్కా... ఇంట్లోనే!

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో అనేక రాష్ట్రాలలో పాఠశాలలకు అనుకోకుండా సెలవులు వచ్చిపడ్డాయి. దీనివల్ల చాలామంది పిల్లలు ఏడాది చివర పెట్టే పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నారు. టీచర్ల దగ్గర సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇంటిపట్టునే ఉన్నా, వెబ్‌సైట్లు, లెర్నింగ్‌ యాప్స్‌ను ఎంచుకోవడం ద్వారా పిల్లలు పరీక్షలకు పూర్తి స్థాయిలో ప్రిపేర్‌ కావచ్చు.


స్కూల్‌కు వెళ్లకపోయినా, టీచర్లు అందుబాటులో లేకపోయినా ఇంట్లో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. సందేహాలను నివృత్తి చేసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావచ్చు. కంప్యూటర్‌ లేకపోతే నాన్న వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో లెర్నింగ్‌ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నా సరిపోతుంది. కొన్ని పాఠశాలలు ఇప్పటికే యాప్‌లు తయారుచేసి పిల్లలకు అందించాయి. వాటిలోనే పిల్లలకు అవసరమైన గైడెన్స్‌ ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఒకవేళ మీ స్కూల్‌కు అలాంటి యాప్‌ లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని  ప్రిపేర్‌ కావచ్చు. 


టాపర్‌గా నిలవాలంటే...

సీబీఎ్‌సఈ, ఐసీఎస్‌ ఈ సిలబ్‌సతో పాటు స్టేట్‌బోర్డు సిలబస్‌ విద్యార్థులకు ‘TOPPR' యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ యాప్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో వీడియో పాఠాలు సైతం వినచ్చు. హిందీ, ఇంగ్లీషులో పాఠాలు అందుబాటులో ఉంటాయి. మాక్‌టెస్టులకు హాజరు కావచ్చు. మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌.... ఇలా సబ్జెక్ట్‌ ఏదైనా 24 గంటలూ సబ్జెక్ట్‌ నిపుణులు అందుబాటులో ఉంటారు. గత ప్రశ్న పత్రాలు, ముఖ్యమైన ప్రశ్నలు అందుబాటులో ఉంటాయి. https://www.toppr.com/


టాపిక్‌ వైజ్‌ టెస్టుల కోసం...

మోడల్‌ ప్రశ్నపత్రాల సహాయంతో పరీక్షకు సిద్ధం కావడానికి ‘మెరిట్‌నేషన్‌’ ఉపయోగపడుతుంది. పిల్లలు చదువుకుంటున్న సమయంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. వీడియో పాఠాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రాక్టీస్‌ ప్రశ్నలు అన్‌లిమిటెడ్‌గా లభిస్తాయి. ఆరోతరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. టాపిక్‌ వైజ్‌గా టెస్ట్‌లు రాసే వీలుంది. రివిజన్‌ చేసుకోవడానికి సులభమైన నోట్స్‌ లభిస్తాయి. https://www.meritnation.com/ 


ఆన్‌లైన్‌లో వర్క్‌షీట్లు

ప్రతి సబ్జెక్టులో పర్‌ఫెక్ట్‌ కావడానికి ‘బైజూస్‌’ యాప్‌ ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఇందులో వీడియో పాఠాలు వినొచ్చు. ఛాప్టర్‌ వైజ్‌గా టెస్టులు రాయొచ్చు. మొబైల్‌ యాప్‌ మాత్రమే కాకుండా, కంప్యూటర్‌లోనూ ‘బైజూ్‌స’ను ఉపయోగించుకోవచ్చు. మూడో తరగతి విద్యార్థుల కోసం కూడికలు, తీసివేతలు, వర్డ్‌ ప్రాబ్లమ్స్‌... ఇలా అన్ని రకాల పాఠాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తాము చదువుతున్న తరగతికి సంబంధించిన పాఠాలను ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, ఈవీఎస్‌ వర్క్‌షీట్లు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు, నీతికథలు,  పద్యాలు కూడా చదువుకోవచ్చు. పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి బైజూస్‌ బాగా ఉపయోగపడుతుంది. https://byjus.com/


లైవ్‌ టెస్టులు రాస్తారా?

కిండర్‌గార్టెన్‌ నుంచి పదో తరగతి వరకు ఏ క్లాస్‌ చదువుతున్నా ‘అన్‌ఫోల్డ్‌యు’ యాప్‌ని ఎంచుకుంటే చాలు. మీ సందేహాలన్నీ సమయంతో సంబంధం లేకుండా తీరుతాయి. విద్యార్థుల్లో వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని ఈ యాప్‌ పెంపొందిస్తుంది. వీడియో పాఠాలు వినొచ్చు. వారంలో రెండు రోజులు లైవ్‌ టెస్టులు రాయొచ్చు. సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ సిలబతో పాటు రాష్ట్రాల సిలబ్‌సను పూర్తి స్థాయిలో కవర్‌ చేస్తుంది. సందేహాలు తీర్చుకోవడానికి సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడే వీలుంది. https://www.unfoldu.com/ 


ఎక్స్‌ట్రా మార్కులు గ్యారంటీ

షేప్స్‌, డిజైన్స్‌, ప్లేస్‌ వాల్యూ, మెట్రిక్‌ మెజర్స్‌, కరెన్సీ... ఇలా మ్యాథ్స్‌కు సంబంధించి రివిజన్‌, ఇంగ్లీష్‌, సైన్స్‌ 

సబ్జెక్టుకు సంబంధించిన సందేహాల నివృత్తికి ‘ఎక్స్‌ట్రా మార్క్స్‌’ వెబ్‌సైట్‌ ఉపకరిస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే నర్సరీ నుంచి పదోతరగతి వరకు ఏ క్లాస్‌ అయితే ఆ క్లాస్‌ను ఎంచుకోవాలి. ఇందులో అన్ని రకాల సబ్జెక్టులు ఛాప్టర్‌ వైజ్‌గా 

లభిస్తాయి. https://www.extramarks.com/


వీడియో పాఠాలు

నెర్వస్‌ సిస్టమ్‌ ఎలా పనిచేస్తుందో పుస్తకాల్లో చదువుకున్నారు. కానీ అదే పాఠాన్ని వీడియో రూపంలో చూస్తే ఇక ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి యానిమేటెడ్‌ వీడియో పాఠాలు ‘లెర్న్‌నెక్ట్స్‌’ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. తరగతిని బట్టి ఎంచుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల పాఠాలు ఇందులో ఉన్నాయి. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. https://www.learnnext.com/

Updated Date - 2020-03-21T05:54:55+05:30 IST