Abn logo
Apr 20 2021 @ 23:28PM

జాబ్‌కార్డు ఉన్న కూలీలందరికీ పని కల్పించాలి

తలమడుగు, ఏప్రిల్‌ 20: జాబ్‌కార్డు ఉన్న కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపీడీవో రమాకాంత్‌ కోరారు. మంగళ వారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడు తూ గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి వేసవిలో పనులు కల్పిం చేందుకు పంచాయతీ సెక్రటరీలు, ఉపాధి హామీ సిబ్బంది కృషి చేయాలన్నారు. గతేడాది రుయ్యాడిలో మంజూరైన పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. అదే విధంగా గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో రుయ్యాడి సర్పంచ్‌ పోతారెడ్డి, ఏఈపీవో శ్యాముల్‌, ఈసీ గంగాధర్‌, ఆర్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement