Abortion: వివాహిత, అవివాహితులకు అబార్షన్ హక్కు...సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
ABN , First Publish Date - 2022-09-29T17:14:19+05:30 IST
అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది....
న్యూఢిల్లీ: అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.అవివాహితులే(unmarried) కాదు వివాహితులైన(married) మహిళలందరూ చట్టం ప్రకారం సురక్షితమైన అబార్షన్(safe abortion) హక్కు ఉందని అత్యున్నత సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పును( judgement) వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం( medical termination of pregnancy) ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోందని సుప్రీం పేర్కొంది.