న్యూఇయర్ వేడుకల్లో పోలీసులు.. మందులోకి ముక్క లేదని వారు చేసిన పనికి గ్రామస్తులు షాక్.. చివరకు

ABN , First Publish Date - 2022-01-02T21:54:57+05:30 IST

న్యూఇయర్ వచ్చిందంటే రాత్రి పగలు తేడా లేకుండా మత్తులో జోగుతుంటారు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ వారి వారి స్థాయిని బట్టి పార్టీలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఒడిశాలో వేడుకల పేరుతో..

న్యూఇయర్ వేడుకల్లో పోలీసులు.. మందులోకి ముక్క లేదని వారు చేసిన పనికి గ్రామస్తులు షాక్.. చివరకు
స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులు

న్యూఇయర్ వచ్చిందంటే రాత్రి పగలు తేడా లేకుండా మత్తులో జోగుతుంటారు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ వారి వారి స్థాయిని బట్టి పార్టీలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఒడిశాలో వేడుకల పేరుతో పోలీసులు చేసిన పని హాట్ టాపిక్ అయింది. అందరిలాగే వీరు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మందులోకి ముక్కలేదని.. పోలీసులు చేసిన పనికి గ్రామస్తులు షాక్ అయ్యారు. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..


ఒడిశాలోని బలంగీర్ జిల్లా సింధేకెలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. న్యూఇయర్ సందర్భంగా పోలీసులు శుక్రవారం వేడుకలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అసలే పోలీసులు కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా అన్ని సిద్ధమయ్యాయి. కావాల్సినంత మందు కూడా తెచ్చుకున్నారు. అయితే అందులోకి ముక్క లేకపోవడం వారికి నచ్చలేదు. ఫ్రీగా మేకలు, పొట్టేళ్లు ఎలా సేకరించాలని ఆలోచించారు. అంతలో వారికి సమీపంలోని మేకల మంద కనిపించింది. ఇంకేముందీ వెంటనే అక్కడికి వెళ్లి.. బలంగా ఉన్న రెండు మేకలను ఎత్తుకొచ్చారు.

ప్లాస్టిక్ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు ఆరోగ్యంగా ఉన్నా.. పరీక్షించిన వైద్యులు ఏమంటున్నారంటే..


అన్ని సిద్ధమవడంతో మేకలను కోసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో మేకల యజమాని సంకీర్తనగురుకు అనుమానం వచ్చింది. మేకల కోసం ఊరంతా వెతుకుతూ స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ తన మేకలను పోలీసులే కోయడం చూసి షాక్ అయ్యాడు. వారిని అడ్డుకుని మేకలను వదలాలని ప్రాథేయపడ్డాడు. అయితే వారు అతన్ని బెదిరించి పంపించారు. ఊర్లేకి వెళ్లిన సంకీర్తనగురు.. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. అంతా కలిసి స్టేషన్ వద్దకు వచ్చారు. పోలీసులు వినకపోవడంతో అక్కడే ధర్నా చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వెళ్లడంతో విచారణ అనంతరం ఏఎస్ఐ సుమన్‌ మల్లిక్‌ను సస్పెండ్ చేశారు.

ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని..

Updated Date - 2022-01-02T21:54:57+05:30 IST