మస్కట్: ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) తాజాగా కీలక ప్రకటన చేసింది. వీసా కలిగిన వారందరికీ ఒమన్‌లో ప్రవేశించేందుకు వీలు కల్పించింది. అథారిటీ సమన్వయంతో వీసాదారులందరూ సుల్తానేట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు అని సీఏఏ తన ప్రకటనలో పేర్కొంది. ఇక గత కొన్ని నెలలుగా ఆ దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వీదేశీయుల రాకపై ఒమన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సుమారు ఐదు మిలియన్ల మంది జనాభా గల ఒమన్‌లో ఇప్పటి వరకు 1,76,668 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,821 మంది వైరస్‌కు బలయ్యారు.