గర్భిణులకు అన్ని రకాల వైద్యసేవలు

ABN , First Publish Date - 2021-06-24T04:28:56+05:30 IST

జిల్లా ప్ర భుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు సంబంధించిన అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంచుతామని జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ చందూనాయక్‌ అన్నారు.

గర్భిణులకు అన్ని రకాల వైద్యసేవలు
గర్భిణుల వార్డును పరిశీలిస్తున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌

- ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో  చందూనాయక్‌

- జిల్లా ఆస్పత్రిలో వార్డుల పరిశీలన 

- రోగులకు అందుతున్న 

వైద్యసేవలపై ఆరా..

వనపర్తి వైద్యవిభాగం, జూన్‌ 23: జిల్లా ప్ర భుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు సంబంధించిన అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంచుతామని జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ చందూనాయక్‌ అన్నారు. బుధవారం జిల్లా ఆస్ప త్రిలో ఆయన వార్డులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. స్థానిక వైద్యులతో మాట్లాడారు.  అనం తరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు.  జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి కేవలం 1వ, 2వ ఆపరేషన్‌ కాన్పులు మాత్రమే జరిగేవని ఇక నుంచి 3వ, 4వ సెక్షన్‌ (ఆపరేషన్‌) కాన్పులను కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేశామన్నారు.  జిల్లా ఆస్పత్రి అయినప్పటికీ తమకేమీ ప్రయోజనం లేద నే భావన ప్రజల్లో పోగొట్టడం  కోసం  అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు. అంతేకాకుండా కొవిడ్‌ పాజిటివ్‌ గర్భిణులకు స్థానికంగానే ఆపరేషన్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా ఆస్పత్రికి బ్లడ్‌ బ్యాంక్‌ అం దుబాటులో ఉందని, నలుగురు గైనకాలజిస్టులు, పిడియాట్రీషన్స్‌, అనస్తీసియాన్స్‌, సర్జన్‌, పల్మనాల జిస్ట్‌, ఫిజీషియన్‌, ఆర్తో, సైకియాట్రీస్ట్‌ వంటి అను భవం కలిగిన వైద్యులు ఉన్నారని అన్నారు. జిల్లాకు ఎంసీహెచ్‌ కేంద్రం కూడా మంజురైందని, అందుకు సంబంధించిన పిడియాట్రీషన్‌ డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరగటం వలన గడిచిన కొన్ని నెలలుగా సాధారణ ఆపరేషన్‌లను నిలిపేశామని, ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో సాధారణ ఆపరేష న్‌లు కూడా చేస్తామన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ వలన త్వరలోనే జిల్లాలో డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు కానుందని, మెడికల్‌ కాలేజ్‌ కూడా రానుందని, ఇప్పటికే ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రం కూడా ట్రయల్‌ రన్‌ పూర్తి అయిందన్నా రు. రానున్న రోజుల్లో జిల్లా ప్రజలకు పూర్తి స్థాయి లో అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు అందుబా టులోకి అందనున్నాయన్నారు. సమావేశంలో జిల్లా ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీష్‌సాగర్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ చైతన్యగౌడ్‌, డాక్టర్‌ రజ్‌కుమార్‌, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:28:56+05:30 IST