విచారణలన్నీ ఆన్‌లైన్‌లోనే: హైకోర్టు

ABN , First Publish Date - 2020-04-10T07:14:06+05:30 IST

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో విచారణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టడానికి తగిన మార్గదర్శకాలను హైకోర్టు తాజాగా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల...

విచారణలన్నీ ఆన్‌లైన్‌లోనే: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో విచారణ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టడానికి తగిన మార్గదర్శకాలను హైకోర్టు తాజాగా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖరారు చేసిన వాటిపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ప్రకటన విడుదల చేశారు. అన్ని దిగువ కోర్టుల్లోనూ అత్యవసర కేసుల విచారణ కోసం అనువైన యాప్‌/సా్‌ఫ్టవేర్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్‌ నిర్వహించాలి.


సివిల్‌ కేసుల్లో తీర్పులు/ఉత్తర్వులు జారీ చేయాలంటే ముందుగా ఇరుపక్షాలకూ వాట్సాప్‌, ఈ-మెయిల్‌లో నోటీసు పంపాలి. జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ‘నోటీసు’ అప్‌లోడ్‌ చేసి, ఇరువైపు న్యాయవాదులకూ వాటిని అందజేసి సివిల్‌ కేసుల్లో తీర్పులు/ఉత్తర్వులు జారీ చేయవచ్చు. 


Updated Date - 2020-04-10T07:14:06+05:30 IST