Abn logo
Sep 24 2021 @ 00:44AM

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి

సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి


 : కలెక్టర్‌ నాగలక్ష్మి 

- కందుకూరులోని సచివాలయాల తనిఖీ

అనంతపురంరూరల్‌,సెప్టెంబరు23: అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండలంలోని కందుకూరులోని సచివాలయాలు, ఆర్‌బీకేలను ఆర్డీఓ మధుసూదన, ఇతర మండల అ ధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా సచివాలయాల్లోని సేవలపై ఆరా తీశారు. ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణ తదితర వాటిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌బీ కేలో పంట నమోదు పత్రాలను రైతులకు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సచివాలయాలకు వ చ్చే సర్వీసులను వెంటనే పరిష్కరించాలని, గడువు తీరిన సర్వీసులు పెండింగ్‌లో ఉంచడానికి వీలు లేదన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను నమోదు చేసేలా చూడాలన్నారు. ఉద్యోగులు బయోమెట్రిక్‌ అటెండెన్సను ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను వెంటనే పూర్తి చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించారు.  కరోనా వ్యాక్సిన ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో అపరిశుభ్రతకు తావు ఇవ్వకుండా చూడాలన్నారు.   ఈ కార్యక్రమంలో హార్టికల్చర్‌ డీడీ పద్మలత, ఏపీడీ సతీష్‌, తహసీల్దార్‌ మోహనకుమార్‌, ఎంిపీడీఓ శ్రీవిద్య, ఏఓ వెంకటేశ్వరప్రసాద్‌, ఏఈఓ ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.