రహదారులన్నీ మహానాడు వైపు

ABN , First Publish Date - 2022-05-29T07:07:22+05:30 IST

తెలుగుదేశం పార్టీ 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒంగోలులో జరిగిన మహానాడుకు వాహనాలు బారులు తీరాయి. శనివారం మండవవారిపాలెంలో జరిగిన మహానాడు బహిరంగసభకు ఎండను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే తెలుగుతమ్ముళ్లు రావటం విశేషం. రాష్ట్రం నలుమూలల్లో ఉన్న దారులన్నీ కూడా మహానాడు వైపునకు వచ్చే వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాలు సమకూర్చుకుని వెల్లివిరిసిన చైతన్యంతో జనం బహిరంగసభకు హాజరయ్యారు. ఈ నేపఽథ్యంలో ట్రాఫిక్‌ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పోలీసులు ముందుచూపు లేకపోవటం అందుకు కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రస్థాయిలో జరిగే మహానాడును అంచనా వేయటంలో కూడా పోలీసు వైఫల్యం కనబడింది. మండుటెండలో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు.

రహదారులన్నీ మహానాడు వైపు
మహానాడు ప్రాంగణం ఎదురు జాతీయరహదారిపై కిక్కిరిసిన వాహనాలతో నిలిచిపోయిన ట్రాఫిక్‌

బారులు తీరిన వాహన శ్రేణి

50వేల వాహనాలు వచ్చినట్లు అంచనా

ముందస్తు చూపులేని పోలీసులు

గంటల తరబడి ట్రాఫిక్‌ జాం

చంద్రబాబుకు తప్పని ట్రాఫిక్‌ తిప్పలు

ఆటోలు, ట్రాక్టర్లు, బైకులు అధికం

మేదరమెట్ల నుంచి సింగరాయకొండ వరకు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు

ఒంగోలు(క్రైం), మే 28 : తెలుగుదేశం పార్టీ 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒంగోలులో జరిగిన మహానాడుకు వాహనాలు బారులు తీరాయి. శనివారం మండవవారిపాలెంలో జరిగిన మహానాడు బహిరంగసభకు ఎండను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే తెలుగుతమ్ముళ్లు రావటం విశేషం. రాష్ట్రం నలుమూలల్లో ఉన్న దారులన్నీ కూడా మహానాడు వైపునకు వచ్చే వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాలు సమకూర్చుకుని వెల్లివిరిసిన చైతన్యంతో జనం బహిరంగసభకు హాజరయ్యారు. ఈ నేపఽథ్యంలో ట్రాఫిక్‌ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పోలీసులు ముందుచూపు లేకపోవటం అందుకు కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రస్థాయిలో జరిగే మహానాడును అంచనా వేయటంలో కూడా పోలీసు వైఫల్యం కనబడింది. మండుటెండలో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. చంద్రబాబు నాయుడితో పాటు అచ్చెన్నాయుడు, యువనేత లోకేష్‌లు కూడా ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకోవడం పోలీసుల పనితీరుకు దర్పణం పడుతుంది. మేదరమెట్ల నుంచి సింగరాయకొండ వరకు వాహనదారులు ట్రాఫిక్‌ అడ్డంకులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని పోలీసులు ముందస్తుగా అంచనా వేసి తగు చర్యలు చేపడితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అని చర్చ జరుగుతుంది. అందుకు 50వేల వాహనాలు వినియోగించారు. మహానాడు జరిగే ప్రాంతానికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారిపైన పోలీసులు స్టాపర్లు ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ముఖ్యమైన ప్రాంతాల్లో బార్కేడ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌ మళ్లింపులాంటి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేదికాదు. కార్యక్రమాన్ని అంటీముట్టనట్లుగా వ్యవహరించటంతో అటు మహానాడుకు వచ్చే వారితో పాటుగా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు. 

పోలీసుల ఓవరాక్షన్‌

పోలీసులు ట్రాపిక్‌ నియంత్రణ చేయాల్సింది మరిచి ఓవరాక్షన్‌ చేయటంతో ప్రజాగ్రహానికి గురయ్యారు. ప్రాంగణం ముందు రోడ్డు వెంట పార్కు చేసిన కార్లకు ఓ కానిస్టేబుల్‌ గాలితీయటం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా మహానాడుకు వచ్చే వాహనదారుల ఆర్సీలు లైసెన్సులు చెక్‌ చేసి కొన్నిచోట్ల పోలీసులు ఫైన్‌ వేయటం కూడా విమర్శలకు తావిస్తుంది. మహానాడుకు వచ్చిన వారితో పార్కింగ్‌ విషయంలో అక్కడక్కడా పోలీసులు దురుసుగా కూడా వ్యవహరించి వారితో గొడవలకు దిగారు.మహానాడు ప్రాంగణం నుంచి అటు త్రోవగుంట, ఇటు కొప్పోలు ఫ్లైఓవర్‌, ఒంగోలు నగరంతోపాటు అన్ని రోడ్లు గంటల తరబడి ట్రాపిక్‌ నిలిచిపోయింది.  


Updated Date - 2022-05-29T07:07:22+05:30 IST