రోడ్లన్నీ గుంతలే..!

ABN , First Publish Date - 2022-08-12T03:31:13+05:30 IST

ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లోని రహ దారులు గుంతలతో బురదమయంగా మారుతున్నాయి.

రోడ్లన్నీ గుంతలే..!
దొనకొండ నుంచి పొదిలి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి

వర్షపు నీరు, బురదతో నరకం

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు 

మరమ్మతులు చేయాలని ప్రజల విజ్ఞప్తి

దొనకొండ, ఆగస్టు 11 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు గ్రామాల్లోని రహ దారులు గుంతలతో బురదమయంగా మారుతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లోని మట్టిరోడ్లు బురద మ యం కావడంతో పాదచారులు నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ఉంది.  వా హ నాల చోదకులు సహితం జారి కిందపడతామని జంకుతున్నారు. వర్షాలకు రోడ్లపై నీరు నిలవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏం రోగాలు వస్తా యోనని మరోపక్క గ్రామీణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండ నుంచి పొదిలి వెళ్లే  ప్రధాన రహదారి గుంతలమయమైంది. కొద్దిపాటి వానకు గుంతల్లో నీరు నిలిచి ఉం డడంతో ఎక్కడ గోతులు ఉన్నాయో ఎక్కడ లేవో తెలియక వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.   రాత్రివేళల్లో ప్రయాణించేవారు గుంతల్లో ఇరుక్కు పోయి అదుపుతప్పి కింద పడుతున్న సంఘ టనలు చోటుచేసుకుం టున్నాయి. ఈ ప్రధాన రహదారిపై అధికారులు, పాలకులు నిత్యం రాకపోకలు సా గిస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామాల్లో సి మెంట్‌ రోడ్లతో పాటు కాల్వలను నిర్మించాలని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-12T03:31:13+05:30 IST