Oct 20 2021 @ 03:50AM

సిని‘మా’ సభ్యులంతా జోకర్లు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసి, కొత్త అధ్యక్షుడు కొలువైనా ఇంకా కొనసాగుతున్న వివాదాలపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. ‘‘మా’ ఒక సర్కస్‌ కంపెనీ. అందులో ఉన్న సభ్యులంతా జోకర్లు’ అని ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన మంచు మనోజ్‌ ‘‘మా’ సర్కస్‌ అయితే మీరు పెద్ద రింగ్‌ మాస్టర్‌ సర్‌’ అని బదులిచ్చారు.