Abn logo
Oct 20 2020 @ 04:32AM

ఆడాళ్లూ... మీకు జోహార్లు

Kaakateeya

‘నేను... శైలజ’ విజయం తర్వాత దర్శకుడు కిశోర్‌ తిరుమల ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ అని ఓ చిత్రం చేయాలనుకున్నారు. వెంకటేశ్‌కి కథ కూడా చెప్పారు. వాళ్లిద్దరూ... తమ కలయికలో చిత్రం రూపొందుతోందని చెప్పుకొచ్చారు. కానీ, ఎందుకో పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆ కథతో చిత్రం చేయడానికి కిశోర్‌ తిరుమల సిద్ధమయ్యారు. శర్వానంద్‌ కథానాయకుడిగా ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ చేయనున్నారని తెలుస్తోంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం. శర్వానంద్‌తో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జనవరి నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. తొలుత వెంకటేశ్‌ని కథానాయకుడిగా అనుకున్నప్పటికీ... శర్వానంద్‌ శైలికి తగ్గట్టు కథ, కథనం, సన్నివేశాల్లో మార్పులు చేశారట.

Advertisement
Advertisement