అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు : డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2020-06-07T11:21:04+05:30 IST

జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 వేల

అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు : డిప్యూటీ సీఎం

కడప (ఎర్రముక్కపల్లె), జూన్‌ 6 : జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కడప రెండో డివిజన్‌ నానాపల్లెలో శనివారం ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యల తెలుసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు.


ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం రాబోయే నాలుగు సంవత్సరాల్లో దశల వారీగా లబ్ధిదారులకు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇంటి పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాటుల చేస్తున్నామని, జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ జయంతి సందర్భంగా ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామన్నారు. ప్రస్తుతం 17 వేల ఇంటి స్థలాలకు భూమి గుర్తించామని, ఇంకా 10 వేల మందికి స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు. ఇందుకు 250 ఎకరాల భూమి కావాల్సి ఉందన్నారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి కొద్దిరోజులే గడువు ఉన్నందున పట్టా భూమి కొనుగోలు చేసి అర్హులందరికీ ఇస్తామన్నారు.


జేసీ గౌతమి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ సురే్‌షబాబు, వైసీపీ నాయకులు అహ్మద్‌బాష, ఆర్డీవో మలోలా, మున్సిపల్‌ కమిషనరు లవన్న,. తహసీల్దారు శివరామిరెడ్డి, వైసీపీ నేతలు దాసరి శివప్రసాద్‌, సుభాన్‌బాషా, షఫి, సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T11:21:04+05:30 IST