బీజేపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-06-28T06:51:03+05:30 IST

గడిచిన ఎనిమిదేళ్లలో బీజేపీ పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని చివరకు దేశభద్రతతో ముడిపడి ఉన్న సైన్యంలోనూ ప్రైవేట్‌పాత్రను పెంచి పోషిస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కన్వీనర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం
కలెక్టరేట్‌ ఎదుట సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ శ్రేణులు

చివరకు సైన్యాన్ని ప్రైవేటీకరిస్తున్నారు

అగ్నిపథ్‌ వ్యతిరేక సత్యాగ్రహ దీక్షలో ఏఐసీసీ నేత ఏలేటి

నిర్మల్‌ అర్బన్‌, జూన్‌ 27 : గడిచిన ఎనిమిదేళ్లలో బీజేపీ పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని చివరకు దేశభద్రతతో ముడిపడి ఉన్న సైన్యంలోనూ ప్రైవేట్‌పాత్రను పెంచి పోషిస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కన్వీనర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం సైన్యం నియామకంలో తీసుకువచ్చిన అగ్నిపథ్‌ వ్యవస్థను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయి పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. బీజేపీ పాలన మొత్తం ప్రైవేట్‌శక్తుల ఆధీనంలోకి వెళ్లిందని, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ తమ ప్రైవేట్‌ సంస్థలుగా మార్చుకుందని, ప్రతి పక్ష రాజకీయ పార్టీల నేతలను వేధించడమే లక్ష్యంగా ఈ సంస్థలు పని చేస్తు న్నాయని ఆరోపించారు. సైన్యంలో చేరే యువతకు సంబంధించి కేవలం నాలు గు ఏళ్లు మాత్రమే పనిచేసేలా తీసుకువచ్చిన కాంట్రాక్టు విధానం అసలే సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దేశభద్రత వ్యవహారం తీవ్రప్రమాదం లో పడుతుందని ఆయన హెచ్చరించారు. కొత్త విధానాన్ని రద్దు చేసే దాకా కాంగ్రెస్‌ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని, నిరుద్యోగ యువతకు చివరిదాకా అండగా ఉంటామని ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కేసీఆర్‌

ఇక రాష్ట్రంలోనూ దుర్మార్గమైన పాలన సాగుతోందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపిం చారు. వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ ఆయన కుటుంబం రాష్ట్ర ఖజానాఖాళీ చేసిందని విమర్శించారు. పరిస్థితి చేయి దాటి పోయిందని, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్‌ రాష్ట్రంలో ఉన్న వనరులు అన్నింటినీ దోచుకుని అప్పుల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. అటుకేంద్రం ఇటురాష్ట్రం ఇద్దరూ చేస్తున్న పాలనలో ప్రజలు అసలే సంతోషంగా లేరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధిచెప్పడం ఖాయం అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే... వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కేంద్రంలోనూ మోదీ పాల నపై బడుగు, బలహీన వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేవలం కార్పొరేట్‌ బడా కంపెనీలకు వత్తాసు పలికే విధంగా మోదీపాలన సాగుతోందని ఆరోపిం చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా తన సత్తాను చాటి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తక్కల రమణారెడ్డి, సాధ సుదర్శన్‌, డి. ముత్యంరెడ్డి, జమాల్‌, నాం దేడపు చిన్ను, సంతోష్‌, జునైద్‌, ధని పోతన్న, రాంశంకర్‌రెడ్డి, సరికెల గంగన్న, జింకసూరి, మార గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

చికిత్స పొందుతున్న వ్యక్తికి పరామర్శ

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 27 : మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమ వారం స్థానిక ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరా మర్శిం చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కౌన్సి లర్‌ గంజాల లక్ష్మి బంధువైన వ్యక్తి పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు. పార్టీ నాయకులు మహేశ్వర్‌రెడ్డి వెంట ఉన్నారు. 

Updated Date - 2022-06-28T06:51:03+05:30 IST