కాంగ్రెస్‌ హయాంలోనే అన్ని వర్గాలకు మేలు

ABN , First Publish Date - 2022-08-11T05:25:38+05:30 IST

కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అన్ని వర్గాలకు మేలు
మానవపాడులో మాట్లాడుతున్న మల్లురవి

 - ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌,

    టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి

- అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాల్లో 

   రెండవ రోజు కొనసాగిన 

   ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర

ఉండవల్లి/మానవపాడు/ఎర్రవల్లిచౌరస్తా/కేటీదొడ్డి, ఆగస్టు 10: కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని  ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు.  ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర రెండ వ రోజు బుధవారం ఉండవల్లి, మానవపాడు, ఇటిక్యాల మండలాల పరిధిలో కొనసాగింది.  ఉండవల్లి మండలం కంచుపాడు, ఇటిక్యాలపాడు, తక్కశిల గ్రామాలలో పాద యాత్ర కొనసాగించారు.  అనంతరం ముందు  పాదయాత్రలో కంచుపాడు గ్రామానికి చేరుకున్న సంపత్‌కుమార్‌ సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్ది సేపు చర్చించారు. అనంతరం సురవరం సుధాకర్‌ రెడ్డి ఇచ్చిన తేనేటీ విందును స్వీకరించారు.  అనంతరం పాదయాత్రలో ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైపల్యాలను ప్రజలకు వివ రించారు. మానవపాడు మండలంలో జల్లాపురం, బోరవెల్లి, మా నవపాడు గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది.   టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసుగెత్తి పో యారని టీపీసీసీ ఉపాఽధ్యక్షుడు మల్లురవి  ఆరోపిం చారు.  టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల నెత్తిన టోపి పెడుతుందన్నారు. అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ మా ట్లాడుతూ బంగారు తెలం గాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్రంలోని ప్రజలు టీఆర్‌ఎస్‌ పాలన లో విసుగుచెందారని, రాబోయే రోజుల్లో ప్రజలు టీఆర్‌ ఎస్‌ తగిన బుద్ధి  చెప్పాలని కోరారు. అనంతరం ఇటిక్యా ల మండలం ఆర్‌.గార్లపాడుకు చేరుకుంది.  రానున్న ఎ న్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సంపత్‌ కోరారు. రాత్రి  బీ వీరాపురం చేరుకొని అక్కడే బస చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా యువజన అధ్యక్షు డు దీపక్‌ ప్రజ్ఞా, శేషన్‌ గౌడ్‌, నాగేష్‌, చాందుపాషా, హరి ప్రసాద్‌, మానవపాడు ఎంపీపీ అశోక్‌రెడ్డి, నాయకులు బోరవెల్లి శశిరెడ్డి,   జయ మ్మప్రకాష్‌గౌడ్‌, కరుణసింహారెడ్డి, సోమన్నగౌడ్‌, నేతాజీ గౌడ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ గౌడ్‌, ఎర్రవల్లి సర్పంచ్‌ రవి,  కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

- గద్వాల నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు పటే ల్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్ర బుధవారం కేటీదొడ్డి మండలంలోని మల్లాపు రం, కుచినెర్ల, నందిన్నె, కేటీదొడ్డి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలను పటిష్టం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్య క్షుడు రాజీవ్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బల్గెర నారాయణరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు వెంకట స్వామిగౌడ్‌, వీరుబాబు, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, నాయకులు గౌస్‌, శేషాద్రి ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.   





Updated Date - 2022-08-11T05:25:38+05:30 IST