Abn logo
May 16 2021 @ 23:36PM

రోడ్లన్నీ నిర్మానుష్యం

మోపాల్‌, మే 16: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం 11వ తేది నుంచి 21వ తేది వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఉదయం 10 గంటల నుంచి వ్యాపార సం స్థలన్నీ మూసిఉంచుతున్నారు. అందరు నిబంధనలు పాటించాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నవారికి జరిమానా విధిస్తున్నారు. మోపాల్‌, ముదక్‌పల్లి, మంచిప్ప, బాడ్సి, సిర్పూర్‌ త దితర గ్రామాలకు ఇతరులను రానియకుండా జాగ్రత్త పడుతున్నారు. మా స్కులు లేకుండా తిరుగుతున్నవారికి సిబ్బంది జరిమానాలు విధిస్తున్నారు. 

నవీపేట: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌ న్‌ 5వ రోజైన ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం మాంసం దు కాణాలతోపాటు కిరాణషాపుల వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. ఉదయం 10 గంటల తర్వాత పోలీసులు దుకాణాలను మూసివేయించ డంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. 

భీమ్‌గల్‌: కరోనా నియంత్రణలో భాగంగా భీమ్‌గల్‌ పురపాలక సంఘం పరిధిలోని లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరుగుతుంది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు వ్యాపార సంస్థలు కొనసాగినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వ ఆ దేశాలు, పోలీసుల సూచన మేరకు స్థానిక సర్వసమాజ్‌ సహకారంతో ప ట్టణంలో వ్యాపార సంస్థలప్నీ మూసివేసి లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మరిపోవడమే గా కుండా ఎవరి ఇళ్లల్లో వారు ఉంటూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. 

ముప్కాల్‌: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ప్రశాం తంగా కొనసాగింది. ఆదివారం ముప్కాల్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనాలు లేక రోడ్డు వెలవెలబోయాయి. గ్రామాల్లో సైతం ప్రజలు ఉపాధి పనులు, వ్యవసాయ పనులు మినహా బయట తిరగడానికి జంకుతున్నారు. మం డల కేంద్రంతో పాటు గ్రామాలలో ఎస్సై హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో పెట్రో లింగ్‌ చేస్తున్నారు. బయటతిరుగుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు 

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలో ఐదోరోజు కొనసాగింది. ఉదయం 10 గంటల తర్వాత వ్యాపార సంస్థలను, దుకాణాలను మూసి వేసి లాక్‌డౌన్‌ కు మద్దతు ఇస్తున్నారు. నిజాంసాగర్‌కెనాల్‌ క్లాక్‌టవర్‌ సమీపంలో రోడ్ల పైకి వస్తున్న వాహనదారులను జరిమానాలు విధిస్తున్నట్టు ఎస్సై శ్రీనాథ్‌ తెలిపారు. 10గంటల తర్వాత రోడ్లపైకి ఎవరు రాకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అకారణం గా రోడ్లపైకి రావొద్దని సీఐ సైదేశ్వర్‌ తెలిపారు.  

ద్రావణం పిచికారీ

మెండోర: మండల కేంద్రంలో వీధుల గుండా గ్రామసర్పంచ్‌ మచ్చర్ల ల క్ష్మీరాజారెడ్డి, పంచాయతీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామసర్పంచ్‌ ప్రత్యేక ట్యాంకర్‌ ఏర్పాటు చేసి ఇటీ వల కరోనా వైరస్‌ బారిన పడిన వారి వీధులతో పాటు గ్రామవీధుల్లో ద్రా వణాన్ని పిచికారీ చేయించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రతీఒ క్కరు కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ మాస్కులు ధరించాల ని, లాక్‌డౌన్‌లో ప్రతీఒక్కరు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించా రు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ రాజ్‌కుమార్‌, భూమేశ్వర్‌, చిరంజీవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement