అర్హులందరికీ ఓటు ఉండాలి

ABN , First Publish Date - 2021-11-29T04:17:40+05:30 IST

అర్హతున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఓటర్ల నమోదు పరిశీలకులు కాంతిలాల్‌ దండే సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలోని ఆదివారం రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్నికలు అధికారులతో సమావేఽశం నిర్వహించారు.

అర్హులందరికీ ఓటు ఉండాలి
మాట్లాడుతున్న కాంతిలాల్‌ దండే

ఓటు నమోదు పరిశీలకులు కాంతిలాల్‌ దండే 

కలెక్టరేట్‌, నవంబరు 28: అర్హతున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఓటర్ల నమోదు పరిశీలకులు కాంతిలాల్‌ దండే సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలోని ఆదివారం రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్నికలు అధికారులతో సమావేఽశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది ముద్రణ నాటికి శతశాతం ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారు కావాలన్నారు. అర్హులైన వారిని ఓటరుగా చేర్పించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించడం పక్కాగా జరగాలన్నారు. జనాభా, ఓటర్ల నిష్పత్తి ప్రతిపదికగా నియోజకవర్గం, మండల పోలింగ్‌ స్టేషన్‌ వారీగా ఓటర్లను పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది, బీఎల్‌వో, బీఎల్‌ఏ, వీఆర్‌వో, వలంటీర్ల సహకారంతో పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పరిశీలించాలన్నారు. రాజకీయ ప్రతినిధులు ఇందుకు సహకరించాలని కోరారు. అంతకు ముందు కలెక్టర్‌ సూర్యకుమారి మాట్లాడుతూ నవంబర్‌ 1న ఓటర్ల జాబితా డ్రాప్ట్‌ను ముద్రించామని, ఈనెల 30 వరకూ క్లైయిమ్‌ల అభ్యంతరాలకు అవకాశం కల్పించామని, వచ్చిన అభ్యంతరాలను డిసెంబరు 20లోగా పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురిస్తామన్నారు. ఓటర్ల నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ను కూడా చేపట్టామన్నారు. కార్యక్రమంలో జేసీలు కిషోర్‌కుమార్‌, మయూర్‌అశోక్‌, సబ్‌ కలెక్టర్‌ భావ్న, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-29T04:17:40+05:30 IST