రిజిస్ట్రేషన్ల దందా!

ABN , First Publish Date - 2021-03-05T06:37:47+05:30 IST

జిల్లాలో కొనసాగుతున్న భూముల రిజిస్ర్టేషన్ల దందా కొనసాగుతుంది. ముఖ్యంగా లింకు డాక్యుమెంట్లు లేకుండానే జ రుగుతున్న ప్లాట్ల రిజిస్ర్టేషన్ల వ్యవహారం అంతటా దుమారం రేపుతోంది. వ్యవసాయేతర భూములకు రిజిస్ర్టేషన్‌ అయిన లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి చేయడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమ రిజిస్ర్టేషన్ల దందాకు కొంతమంది సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సహకరిస్తున్నారన్నారని తెలిసింది.

రిజిస్ట్రేషన్ల దందా!
నిర్మల్‌ పట్టణంలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ఇదే..

జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలకు తూట్లు 

లింక్‌ డాక్యుమెంట్లు లేకున్నా రిజిస్ట్రేషన్లు 

ఇంటి నంబర్లతో సాగుతున్న దందా 

సర్పంచ్‌లు, సెక్రెటరీల చేతివాటం

అక్రమ పల్లె వెంచర్లకు చట్టబద్ధత 

రికార్డుల తారుమారుతో ధ్రువీకరణలు 

 పరోక్షంగా సహకరిస్తున్న అధికారులు 

నిర్మల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొనసాగుతున్న భూముల రిజిస్ర్టేషన్ల దందా కొనసాగుతుంది. ముఖ్యంగా లింకు డాక్యుమెంట్లు లేకుండానే జ రుగుతున్న ప్లాట్ల రిజిస్ర్టేషన్ల వ్యవహారం అంతటా దుమారం రేపుతోంది. వ్యవసాయేతర భూములకు రిజిస్ర్టేషన్‌ అయిన లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి చేయడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమ రిజిస్ర్టేషన్ల దందాకు కొంతమంది సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సహకరిస్తున్నారన్నారని తెలిసింది. 

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాలకు సమీపంలో.. 

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాలకు సమీపంలో గల గ్రామా ల్లో వెలిసిన వెంచర్లకు ఇలా అక్రమ పద్ధతుల ద్వారా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. తమ గ్రామ పరిధిలోని రి యల్‌ ఎస్టేట్‌ వెంచర్లను అక్కడి సర్పంచ్‌, సెక్రెటరీ లు కలిసి అధికారికంగా చేస్తున్నారన్న వాదనలున్నాయి. తమ గ్రామంలో ని ఇంటి నంబర్‌లను వేసి ధృవీకరణ పత్రాలు జారీ చేస్తుండడంతో వెంచర్లలోని సర్వే నంబర్ల ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు అవుతున్నాయని పలువు రు అంటున్నారు. ప్రభుత్వం కొద్దిరో జుల క్రితం ఎల్‌ఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చి డాక్యుమెంట్లు ఉన్న ప్లాట్లను మాత్ర మే రిజిస్ర్టేషన్‌ చేయాలని, డాక్యుమెంట్లు లేని వెంచర్ల ప్లాట్లను రిజిస్ర్టేషన్లు చేయొద్దంటూ ఆదే శాలు జారీ చేసింది. అన్ని అనుమతులు ఉండి ఆ ప్రూవ్‌డు లే అవుట్లలోని వెంచర్లపై మాత్రం ఆంక్షలను విధించలేదు. దీనిని సాకుగా చేసుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారులు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కవ్వడ మే కాకుండా సంబంధిత రిజిస్ర్టేషన్‌ అధికారులతో మిలాఖత్‌ అవు తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వీరంతా కూడగట్టుకొని రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌ లేని ప్లాట్లకు ఇంటి నంబర్లతో ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారని అంటున్నారు. 

ఒక్కో ప్లాటుకు రూ.లక్ష వరకు..

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోని శివారు గ్రామాల కొంతమంది సర్పంచ్‌లు, సెక్రెటరీలు ఈ అక్రమదందాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీరు ఒక్కో ప్లాటుకు రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసి ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారంటున్నారు. సర్వే నంబర్లను చూపి ఆ సర్వే నంబర్‌లో ఇంటి నంబర్లు కేటాయించి జారీ చేస్తున్న ధృవీకరణ పత్రాలను రిజిస్ర్టార్‌ అధికారులు అంగీకరించి వాటికి రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంతమంది దళారులు సంబంధిత రిజిస్ర్టార్‌ అధికారులతో మధ్యవర్తిత్వం నిర్వహించి పెద్దమొత్తంలో డబ్బులు గుంజుతున్నారన్న వాదనలున్నాయి. మరికొంతమంది వెంచర్‌లలోని ప్లాట్ల విస్తీర్ణాన్ని చదరపు గజాల్లో చూపకుండా వ్యవసాయ భూముల పేరిటా గుంటలుగా చూపి రిజిస్ర్టేషన్‌లు చేసుకుంటున్నారంటున్నారు. 

రికార్డులు తారుమారు

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ప్ర తీ వెంచర్‌లోని ప్లాటు, ఇతర ప్లాట్ల రిజిస్ర్టేషన్‌కు అప్పటికే రిజిస్ర్టేషన్‌ అయిన డా క్యుమెంట్‌ను జతచేయడం తప్పనిసరి చేశా రు. ఈ డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ర్టేషన్లు చే యవద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ అ య్యాయి. వెంచర్లు ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు ఓ కొత్త ఎత్తుగడను రూపొందించారు. ఇందు లో భాగంగానే సర్పంచ్‌లను మిలాఖత్‌ చేసుకొని అక్కడి పంచాయతీ సెక్రెటరీతో రికార్డుల తారుమారుకు తెరలేపారు. ఇంటి నంబర్లను సృష్టించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. వీటితో రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసాలో సబ్‌ రిజిస్ర్టార్‌ కా ర్యాలయాలతో పాటు తహసీల్‌ కార్యాలయాల్లో పెద్దఎత్తున రిజిస్ర్టేషన్లు జ రిగినట్లు పలువురు అం టున్నారు. ఈ నయా రిజిస్ర్టేషన్‌ దందాకు కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సూత్రదారులుగా వ్య వహరిస్తూ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శుల ను భాగస్వాములను చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెండు రోజుల క్రితం ఇలా అను మతుల వ్యవహారంలో ఓ సర్పంచ్‌ భర్తతో పాటు గ్రామ కార్యదర్శి, ఎంపీవో ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను లోతుగా పరిశీలిస్తే మరికొన్ని వాస్తవాలు బయటకు రావచ్చు. కొన్ని గ్రామాల్లో వెంచర్లకు అ నుమతులు, తప్పుడు పద్ధతుల్లో రిజిస్ర్టేషన్‌లకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ దందాలో కొంతమంది సర్పంచ్‌లు..

ముఖ్యంగా కొంతమంది సర్పంచ్‌లు ఈ దందాలో అసలు సూత్రదారులుగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో ప్లాటుకు ఇంటి నంబర్‌తో కూడిన ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జ రుగుతోంది. దీంతో పాటు రిజిస్ర్టేషన్‌ అధికారులు సైతం ఇం టి నంబర్‌ డాక్యుమెంట్‌ రిజిస్ర్టేషన్‌లకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీని కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం స్ప ష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే ఆదాయమంతా ప్రభుత్వం ఇప్పుడే కోల్పోవాల్సి వస్తోంది. అ నుమతులు లేని వెంచర్‌లన్నింటిని ఇలా దొడ్డి దారి తో అధికారికంగా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అందరికీ భాగస్వామ్యం ఉన్నా ఎవరూ కూడా వాస్తవాలు బయట పెట్టకుండా దాచి పెడుతున్నారని అంటున్నారు. 

అధికారుల చేతివాటం..

అధికారులకు వాస్తవాలు తెలిసినప్పటికీ వాటిని పక్కన పెట్టి అక్రమ ధృవీకరణ ఉన్న ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. మూడు ప ట్టణాల శివారులోని గ్రామాల్లోని వెంచర్లకు అను మతులు లేవన్నది బహిరంగ రహస్యమే కాకుండా రిజిస్ర్టేషన్‌ చేసే అధికారులకు తెలుసని పలువురు అంటున్నారు. అనుమాంగా ఉన్న డాక్యుమెంట్లకు సంబంధించి ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించకుం డా ఇంటినంబర్లు ఉన్నాయన్న సాకుతో రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. అధికారుల నిర్వహకం కారణంగానే ఈ తతంగమంతా నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా పరిధిలో సాగుతోంది. ఈ వ్యవహారం వెనక పెద్దమొత్తంలో చేతులు కూడా మారుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు గల్తీ రిజిస్ర్టేషన్‌ల దందాపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..

వెంకటేశ్వర్‌రావు (జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్‌ ) 

అక్రమ రిజిస్ర్టేషన్‌ల వ్యవహారం తమ దృష్టికి రాలేదు. జిల్లాలో ఎ క్కడైనా ఇలాంటివి జరిగితే ఫిర్యాదు చేయాలి. పూర్తిస్థాయిలో విచార ణ చేసి చర్య లు తీసుకుంటాం.

Updated Date - 2021-03-05T06:37:47+05:30 IST