Mahanaduకు సర్వంసిద్ధం.. ఒంగోలు పసుపుమయం..

ABN , First Publish Date - 2022-05-27T12:12:51+05:30 IST

తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు

Mahanaduకు సర్వంసిద్ధం.. ఒంగోలు పసుపుమయం..

  • మండువవారిపాలెంలో పండుగ వాతావరణం
  • ఆకట్టుకుంటున్న ఫ్లెక్సీలు, తోరణాలు, జెండాలు

ఒంగోలు : తెలుగుదేశం పార్టీ శ్రేణులు (Telugudesam) అత్యంత వైభవంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. శుక్ర, శనివారాల్లో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరిగే ఈ వేడుకకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత వారంరోజులుగా జరుగుతున్న పనులను ఇక్కడి జిల్లా నేతలతో కలిసి రాష్ట్ర నేతలు నిరంతరం పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయా కమిటీలు తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. కాగా గురువారం మధ్యాహ్నానికే పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఒంగోలుకు చేరుకున్నారు. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా, టీడీపీ (TDP) నిర్వహించే అతిపెద్ద మహోత్సవం మహానాడు కావడంతో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాయి. 


నగరంలోని ప్రధాన వీధుల్లో ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతోపాటు, ముఖ్యనేతల ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీలు, ఎన్టీఆర్‌ శత జయంతి ఫ్లెక్సీలు కళక ళలాడుతున్నాయి. నగర శివారులతోపాటు ప్రధానసెంటర్లు, ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మహా నాడుకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. జాతీయ రహదారి వెంట మంగమ్మకాలేజి వద్ద నుంచి పసుపు తోరణాల ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మరోవైపు మహానాడు ప్రాం గణంలో ఎటు చూసినా పసుపుమయంగా ఏర్పాట్లు చేశా రు. విద్యుద్దీపాల అలంకరణ, మహానాడుకు విచ్చేసేవారికి వేర్వేరుగా గ్యాలరీలు, వీఐపీ గ్యాలరీలు, రక్తదాన శిబిరాలు, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల గొప్పతనం చాటుతూ ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా విచ్చేసే లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్‌ అభిమానుల కోసం అవసరమైన రుచికరమైన వంటకాలు ఇప్పటికే మొదలు పెట్టారు. మరోవైపు క్యాడర్‌ వారీగా పార్కింగ్‌, మెడికల్‌ క్యాంపు లు, మీడియాపాయింట్‌లతో సర్వం సిద్ధం చేశారు.

Updated Date - 2022-05-27T12:12:51+05:30 IST